ఈ ఎర్రర్ సాధారణంగా రాపిడ్ షేర్ ‘‘ఫ్రీ ఎకౌంట్’’ ఉపయోగించే వారికి కనపడుతుంటుంది. దీనికి కారణం రాపిడ్ షేర్ ఫ్రీ ఎకౌంట్ లో ఉన్న టైమ్ లిమిట్, డౌన్ లోడ్ క్వాంటిటి లిమిట్, ఒకే సమయం లో ఒక ఫైల్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లాంటి లిమిటేషన్స్.
ఇక మీరు ఒ ఫైల్ మాత్రమే డౌన్ లోడ్ కు ప్రయత్నిస్తున్నారు, లేదా ఇంతకు ముందు డౌన్ లోడ్ చేసిన ఫైల్ డౌన్ లోడ్ పూర్తయిపోయింది అయినప్పటికీ మీరు మీ ఐపి అడ్రెస్ xxx.xxx.xx.xxx నుండి ఆల్రెడీ ఒక ఫైల్ డౌన్ లోడింగ్ చేస్తున్నారు అని చెబుతూ ఈ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అనేది ఆ ప్రశ్న.
దీనికి కారణం మీ ఐపి అడ్రెస్ అంటే అది మీ ISP ఐపి అడ్రెస్, దానినే పబ్లిక్ ఐపి అడ్రెస్ అంటారు. దానినుండి మీకు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రైవేట్ ఐపి అడ్రెస్ లు ఇవ్వబడతాయి. అది మీ కు మాత్రమే పరిమితం కాదు. మీకు ప్రైవేట్ గా ఇవ్వబడిన స్టాటిక్/డైనమిక్ ఐపి అడ్రెస్ మాత్రమే మీకు సంబంధించినది, స్టాటిక్ ఐపి అడ్రెస్ మీకు స్థిరంగా ఉంటుంది, అదే డైనమిక్ ఐపి అడ్రెస్ అయితే మీరు నెట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతి సారి వేరే ఐపి అడ్రెస్ మీకు కేటాయించబడుతుంది.
దీనికి కారణం ఇప్పటి IPv4 అనే ప్రొటోకాల్ లో ప్రతి నెట్ వర్క్ డివైస్ (అంటే desktop computers, mobile phones, embedded devices, and virtual hosts మొదలైనవి) కు ఒక ప్రత్యేకమైన ఐపి అడ్రెస్ రూటింగ్ (కేటాయించ) గల సామర్ధ్యం లేదు. IPv4 అనే ప్రొటోకాల్ లోని ఈ బలహీనమైన పరిస్థితి చక్కబెట్టటానికి, దీని ద్వారా ఒక సింగిల్ పబ్లిక్ ఇంటర్నెట్ ఐపి అడ్రెస్ ను చాలా లొకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) హోస్ట్ లు ని షేర్ చేసుకునే విధంగా చేయడానికి ప్రస్తుతం Network Address Translation (NAT) అనే ఒక ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. ఈ బలహీనతను అధిగమించడానికి త్వరలో IPv6 ప్రొటోకాల్ ను తీసుకురావటం జరుగుతుంది.
లొకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) హోస్ట్ లు అంటే మీ లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ అన్నమాట, ఇలాంటి లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ లు చాలా మంది ఆ ఒకే ఒక్క సింగిల్ పబ్లిక్ ఇంటర్నెట్ ఐపి అడ్రెస్ ని షేర్ చేసుకుంటారు, అలాగే ఇలాంటి ఒక్కొక్క లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ తన ఐపి అడ్రెస్ నుండి మనలాంటి అనేకమంది అంటే అనేక desktop computers, mobile phones, embedded devices, and virtual hosts కి ప్రైవేట్ ఐపి అడ్రెస్ లుగా షేర్ చేస్తారు. అంటే మనం 3 వ తరంలొ ఉన్నామన్న మాట, అయితే ఇక్కడ రాపిడ్ షేర్ చూపించేది ఇంకా చెప్పాలంటే కనిపెట్టగలిగేది మొదటి తరం - పబ్లిక్ ఇంటర్నెట్ ఐపి అడ్రెస్ ని మాత్రమే.
ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒక పబ్లిక్ ఐపి అడ్రెస్ నుండి మొత్తం 4,294,967,296 మందికి లేదా డివైసెస్ కు ప్రైవేట్ ఐపి అడ్రెస్ కేటాయించే సామర్ధ్యం ఉంటుంది. (ఇలాంటి పబ్లిక్ ఐపి అడ్రెస్ లు మరెన్నో ఉంటాయి) వారందరిలో మీరూ ఒక్కరు మాత్రమే. (అయితే ఈ 4,294,967,296 ఐపి అడ్రెస్ ల లో అధిక మొత్తంలో పబ్లిక్ ఎవరికీ కేటాయించబడకుండా కొన్ని ప్రత్యేక వినియోగం కొరకు రిజర్వ్ చేసి ఉంచబడతాయి. రిజర్వ్ చేసినవి కాక మిగిలిన చాలా ఐపి అడ్రెస్ ల లో మీది కూడా ఒకటి అనేది గుర్తుంచుకోండి). అయితే రాపిడ్ షేర్ మాత్రం వీరెవరినీ గుర్తించదు,
అందువలన మీ ప్రైవేట్ ఐపి అడ్రెస్, రాపిడ్ షేర్ చూపించే ఐపి అడ్రెస్ ఒకటి కాదు, ఎందుకంటే రాపిడ్ షేర్ కు తెలిసేది మీ ISP యొక్క పబ్లిక్ ఐపి అడ్రెస్ మాత్రమే, మీ ప్రైవేట్ ఐపి అడ్రెస్ మీ లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ కి, మీకు తప్ప మరెవ్వరికి తెలియదు, అందుకనే రాపిడ్ షేర్ మీ పబ్లిక్ ఐపి అడ్రెస్ నే పరిగణనలోకి తీసుకుని అలాంటి సమాచారం చూపిస్తుంది, ఎందుకంటే ఆ పబ్లిక్ ఐపి అడ్రెస్ కు సంబంధించిన ప్రైవేట్ ఐపి అడ్రెస్ కేటాయించబడినవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వారిలో ఏ ఒక్కరు రాపిడ్ షేర్ ఫ్రీ ఎకౌంట్ ద్వారా ఏదైనా డౌన్ లోడ్ చేస్తున్నా, మిగతా అందరికి ఇదే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దీనికి కొంత వెసులుబాటుగా ఈ మధ్య రాపిడ్ షేర్ Happy Hours అని ఎక్కువమంది ఫ్రీ యూజర్లు ఉపయోగించుకునేందుకు కొంత సమయం కేటాయించుతుంది, దీనికి ప్రత్యేకంగా ఈ సమయం Happy Hours సమయం అనేది ఉండదు. మనం వెయిట్ చేసి చూసుకోవటమే.
ఇక్కడ ఐపి అడ్రెస్ లకు సంబంధించి మరొక విషయం గమనించవచ్చు, అదేంటంటే ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినపుడు పోలీస్ మరియు పరిశొధనా సంస్థలు ముందుగా మీ పబ్లిక్ ఇంటర్నెట్ ఐపి అడ్రెస్ (ఇది అందరికి అందుబాటులో ఉంటుంది) కనుక్కొని తద్వారా అది ఏ ISP కి సంబంధించిందో తెలుసుకుని (మనం కూడా తెలుసుకోవచ్చు smartwhois ( ( ఈ లింక్ చూడండి http://computerera.co.in/forumnew/showthread.php?t=35) అనే సాఫ్ట్ వేర్ లేదా www.ip-adress.com అనే సైట్ల ద్వారా) ఆ తర్వాత మీ ISP ద్వారా ఆ క్రైమ్ జనరేట్ అయిన లోకల్ ఏరియా నెట్ వర్క్ ని, దానిద్వారా ఆ క్రైమ్ జనరేట్ చేసిన పిసి ని దాని యజమానిని ట్రేస్ చేస్తారు.
INTERESTING PROGRAMS USING C,C++
DOWNLOAD LINK
3-1 TEXT BOOKS DOWNLOAD
SYLLABUS BOOK DOWNLOAD
TEMPLES
Subscribe to:
Post Comments (Atom)
Grab this Widget ~ Blogger Accessories
No comments:
Post a Comment