
Windows Explorer ద్వారా డిస్క్ లోని ఏదైనా ఫోల్డర్ ని Thumbnail Viewలో చూస్తున్నప్పుడు XP ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆ ఫోల్డర్లో Thumbs.db పేరిట ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ డైరెక్టరీలో ఉన్న ఇమేజ్ లకు Cache ఫైల్ గా ఇది పరిగణించబడుతుంది. అంటే మరోమారు ఎప్పుడైనా ఆ ఫోల్డర్ లోకి వెళ్లినప్పుడు మరింత వేగంగా Thumbnails చూపించడానికి ఇది ఉపకరిస్తుంది. అయితే ప్రతీ ఫోల్డర్ లోనూ ఇలా Thumbs.db ఫైల్ క్రియేట్ అవడం ఇష్టం లేని వారు, thumbnail preview కొన్ని క్షణాలు ఆలస్యమైనా ఫర్వాలేదు అనుకునేవారు ఇలా Thumbs.db ఫైల్ క్రియేట్ అవకుండా డిసేబుల్ చేసుకోవచ్చు.
అదెలాగంటే.. Windows Explorer>Tools> Folder Options> View అనే విభాగంలోకి వెళ్లి Files and Folders అనే సెక్షన్ లో "Donot cache thumbnails" అనే ఆప్షన్ ని టిక్ చేస్తే సరిపోతుంది. ఇకపై ఫోల్డర్లని Thumbnail Viewలో ఓపెన్ చేసినా విండోస్ XP ఆయా ఫోల్డర్లలో Thumbs.db పేరిట అదనంగా ఫైల్ ని క్రియేట్ చెయ్యకుండా ఉంటుంది.
No comments:
Post a Comment