
Sevres(paris) లో ఉన్న ఈ మాతృక బరువు క్రమంగా తగ్గుతుందని దానిని పర్యవేక్షిస్తున్న భౌతిక శాస్త్రవేత్త (Physicist) Richard Davis చెబుతున్నారు. పారిస్‌లో ఉన్న ఈ మాతృకని మాత్రమే ‘ప్రపంచ ప్రమాణికమైన మాతృక’గా పరిగణిస్తారు.
రిచర్డ్ డేవిస్ కధనం ప్రకారం, ఆ మాతృకకి సంభందించిన డజన్ నకళ్ళతో పోల్చి, సగటును పరిశీలించగా…దాని బరువు 50మైక్రో గ్రాములు (50 µ grams )తగ్గినట్లుగా గమనించారు. ఈ నకళ్ళన్నింటినీ ఒకే సమయంలో, ఒకే పదార్ధంతో తయారుచేసి…ఒకే పరిస్థితుల మద్య భద్రపరిచినా, వాటి మద్య ద్రవ్యరాశిలో తేడాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామానికి(Mysterious change) ఎవరి దగ్గరా సరి అయిన సమాధానం లేదని ఆయన చెపుతున్నారు.
ఇది నిత్య జీవితంలో అంతగా ప్రభావం చూపకపోయినా, శాస్త్ర సాంకేతిక రంగాలలో తీవ్ర ప్రభావాన్ని కలిగించవచ్చు.’మెట్రిక్ స్థిరాంకం‘లో వచ్చిన ఈ అస్థిరత…శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా ఇబ్బందికరమే. విద్యుత్ ఉత్పాదన రంగంలో లో ఈ అస్థిరత మరింత సమస్యాకరం కాగలదు.
రోజువారీ సామాన్య జీవితంలో ఇది ఎలాంటి ప్రభావం కలిగించదు. కిలోగ్రామ్ కిలోగ్రామ్ గానే ఉంటుంది. తూనికకి ఉపయోగించే తూనిక రాళ్ళని ఏ మార్పు లేకుండానే…వాడుకోవచ్చు.
పారిస్‌లో ఉన్న ఈ మాతృక ని 1889లోనే…అప్పటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాటినం, ఇరిడియం లోహ మిశ్రమంతో స్ఠూపాకారంలో 1.54అంగుళాల ఎత్తు, వ్యాసాలతో తయారుచేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన మాతృకలతో పోల్చేందుకు మాత్రమే…దీనిని బయటకు తీస్తారు. అప్పటికీ తక్కిన మాతృకలని దీని వద్దకు తెస్తారే కాని దీన్ని మాత్రం ఎక్కడికీ తీసుకువెళ్ళరు.
ఈ సంవత్సరం నవంబర్‌లో పారిస్‌లో జరగనున్న, తూనికలు-కొలతలుకి సంభందించిన శాస్త్రవేత్తలతో అంతర్జాతీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొలతలకి సంభందించిన సలహా మండలి, కిలోగ్రామ్‌తో సహా (ఉష్ణోగ్రతకి సంభందించిన కెల్విన్, పరిమాణానికి సంభందించిన మోల్) వివిధ కొలతలలో ఖచ్చితత్వాన్ని తీసుకువచ్చేందుకు తగిన నిర్ణయాల్ని తీసుకోవొచ్చు.
శాస్త్ర రంగం అభివృద్ది చెందే కొద్ది, పాత ప్రమాణాలు మరింత ఖచ్చితత్వానికి లోనవుతాయి. అనంతమైన మానవ జ్ఞానాభివృద్ది, మరింత విస్తృతి అయ్యే కొలది గత ప్రామాణిక కొలతలు దుమ్ము కొట్టుకుపోతాయి.
అనాదిగా అనేక కొలతలలో పరిస్థితులకు అనుకూలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక కడ్డీ మీద రెండు గీతల మద్య దూరం ఒక మీటర్‌గా కొలిచే కాలం నుంచి ‘కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని’ బట్టి ఒక మీటరును కొలిచే పద్దతులు వచ్చాయి.
డేవిస్ ప్రకారం “ఒకే రకమైన పమాణువు, స్థిర ద్రవ్యరాశి ఉన్న సిలికాన్-28 ఐసోటోప్ స్పటికంతో తయారుచేసిన, గోళాకారపు నమూనా ని 21వ శతాబ్దానికి చెందిన ఒక ప్రమాణాత్మక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించవచ్చు. అప్పడు కిలోగ్రామ్‌కి మరింత స్పష్టమైన నిర్వచనం ఉపయోగించవచ్చు”.
No comments:
Post a Comment