
మనం 128 లేదా 256 kbps స్పీడ్ కలిగిన నెట్ కనెక్షన్ ని తీసుకున్నారనుకుందాం. మనకు కేవలం ఆ స్పీడ్ కి లోబడి మాత్రమే స్పీడ్ ఎలా లభిస్తుంది? ఇంకా ఎక్కువ ఎందుకు రాదు? దీనికి ఒక లాజిక్ ఉంది. మనకు నెట్ కనెక్షన్ ని ఇచ్చే ISPలు ప్రతీ యూజర్ అకౌంట్ కీ బ్యాండ్ విడ్త్ ఫిల్టర్లు అప్లై చేస్తుంటాయి. అంటే మన అకౌంట్ కి 512kbps ఫిల్టర్ అప్లై చెయ్యబడిందనుకోండి. అంతకన్నా ఎక్కువ స్పీడ్ మనకు ట్రాన్స్ ఫర్ చెయ్యబడదు. సహజంగా ISPలో కస్టమర్ కాన్ఫిగరేషన్ సెట్టింగులలో Package management, cache management వంటి విభాగాల్లో ఈ ఫిల్టర్లు కాన్ఫిగర్ చెయ్యబడి ఉంటాయి. మన ఒక ప్యాకేజీ నుండి మరో ప్యాకేజీకి మారినప్పుడు ఈ ఫిల్టర్లనూ తదననుగుణంగా పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. ఒకవేళ ఏ కారణం చేతైనా తాత్కాలికంగా ఈ ఫిల్టర్లు ఫెయిల్ అయితే మనకు నెట్ ఫుల్ స్పీడ్ లో రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ISP టెక్నికల్ డిపార్ట్ మెంట్ వారు ఆ సమస్యని గుర్తించి దాన్ని పరిష్కరించి మళ్లీ నార్మల్ స్పీడ్ మనకు వచ్చేలా జాగ్రత్త వహిస్తుంటారు.
No comments:
Post a Comment